_ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై అనుచిత వాక్యాలు సరికాదు
_మహారాష్ట్ర ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
బతుకమ్మ, మద్నూర్: భారతదేశ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పార్టీ బిజెపి అని ఉమ్మడి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గ బుల్డానా నియోజకవర్గం ఎమ్మెల్యే గాయక్వాడ్ సంజయ్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమ నాయకులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తానని అనుచిత వాక్యాలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండింస్తున్నామని తెలిపారు. ఇలాంటి మాటలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు,రమేష్, హన్మండ్లు,విట్టల్ గురుజీ, రామ్ పటేల్,సచిన్, గంగాధర్, రాజు,అమూల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ దేశ ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ
