30.2 C
Hyderabad

ఏసిబికి చిక్కిన బిల్ కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

సంగారెడ్డి, బతుకమ్మ :

 

ఆస్థిపన్నును తగ్గించడానికి లంచం తీసుకుంటు మున్సిపాల్టీ బిల్ కలెక్టర్ ఏసిబికి చిక్కారు. ఈ సంఘటన గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివ పేటలో జరిగింది. సదాశివ పేట మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న మంతుర్ నిఖిల్ రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. నిఖిల్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ప్రాతిపాధికన బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మున్సిపాల్టీ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.1,04,480 ఆస్తి పన్ను రాగా దానిని రూ.49,892 కు తగ్గించేందుకు రూ.35 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇది వరకు 20 వేలు లంచం తీసుకున్న పని చేయకుండా వేదించడంతో బాదితుడు ఏసిబిని అశ్రయించాడు. మున్సిపాల్టీలోనే నిఖిల్ రెడ్డి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకుని అతడిని అరెస్టు చేసి హైదరబాద్ లోని ఏసిబి కోర్టులో హజరు పరిచారు ఏసిబి అధికారులు.

More articles

Latest article