ఏసిబికి చిక్కిన బిల్ కలెక్టర్

  సంగారెడ్డి, బతుకమ్మ :   ఆస్థిపన్నును తగ్గించడానికి లంచం తీసుకుంటు మున్సిపాల్టీ బిల్ కలెక్టర్ ఏసిబికి చిక్కారు. ఈ సంఘటన గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివ పేటలో జరిగింది. సదాశివ పేట మున్సిపాల్టీలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న మంతుర్ నిఖిల్ రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. నిఖిల్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ప్రాతిపాధికన బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. మున్సిపాల్టీ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.1,04,480 ఆస్తి పన్ను రాగా...