- ఎస్సై మొగులయ్య
మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లుర్ రెండోవ ఎస్సై మొగులయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ1 తో ప్రజలను సైబర్ నేరస్తులు మోసగించే పద్ధతి, ఏపీకే ఫైల్స్ గురించి సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలు జరిగే పద్ధతి , సిసి కెమెరాల ఏర్పాటు పై మెగులయ్య గ్రామస్తుల అవగాహన కల్పించారు. తమ ఓటీపి నంబర్లను ఎవ్వరికీ చెప్పవద్దని సూచించారు. ప్రధాన కూడలీల వద్ద తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోల్డెన్ అవర్, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి. ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మొగలయ్య తో పాటు ఏఎస్సై రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవి , శ్రీను గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
