తెలంగాణ యూనివర్సిటీలో బంద్ విజయవంతం

0 9,596

 

. . . పిడిఎస్ యూ నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యూ నాయకులు రాకేష్, దినేష్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపులో భాగంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజ్, ఇంజనీరింగ్, సైన్స్, ఎంబిఏ కళాశాలలు బంద్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల పాలన దాటినా ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రినీ కేటాయించలేదని, విద్యార్థులు యూనివర్సిటీలలో సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించటం లేదని అన్నారు. కొత్త కోర్సులు తీసుకువచ్చి ఔట్ సోర్సింగ్ ఫ్యాకల్టీ తో బోధన నెట్టుకొస్తున్నారని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న రీ ఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని, యూనివర్సిటీ విద్యార్థులకు మెస్ బకాయిలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దార్త, సయోన్, ప్రశాంత్, రాజు, ఆకాష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.