29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో పలు అదనపు కలెక్టర్ ల బదిలీలు

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్ ల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అదనపు కలెక్టర్ లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 27 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూన్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వెయిటింగ్ లో ఉన్న బి.హరిసింగ్ ను సూర్యపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్ డి మాధురిని నల్గొండ స్పెషల్ కలెక్టర్ గా నియమించారు. హెచ్ఎండిఏలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న అదనపు కలెక్టర్ డి.రాజ్య లక్ష్మిని పెద్ద పల్లి అదనపు కలెక్టర్ గా పంపించారు. కామారెడ్డి డీఆర్ఓ సీహెచ్.మదుమోహన్ ను గద్వాల్ అదనపు కలెక్టర్ గా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న వి.హనుమానాయక్ ను వరంగల్ స్పెషల్ కలెక్టర్ గా పంపించారు. హైదరాబాద్ ఎస్ డీసీలో ఉన్న ఎం.సూర్య ప్రకాష్ ను వనపర్తి డీఆర్ఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. సిరిసిల్ల ఆర్డవో సీహెచ్.వెంకటెశ్వర్లును జనగామ డీఆర్ఓగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న బి.వసంత కుమారిని భూపాలపల్లి డీఆర్వోగా నియమించారు. హైదరాబాద్ ఎస్ ఏటీజీలో పని చేస్తున్న ఎస్.పద్మావతిని  భద్రాద్రి కొత్త గూడెం డీఆర్వోగా పంపించారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న వి.రమాదేవిని సిరిసిల్ల డీఆర్వోగా బదిలీ చేశారు.

 

Transfers of several additional collectors in the state

 

మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న జుబేద్ ఉన్నీసా బేగంను మహబుబాబాద్ డీఆర్వో గా ట్రాన్స్ ఫర్ చేశారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్ డి.వేణును అసిఫాబాద్ డీఆర్వోగా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న బి.స్రవంతి ని ఆదిలాబాద్ డీఆర్వోగా పంపించారు. మైనార్టీ వెల్ఫేర్ లో పని చేస్తున్న ఎస్.రాజేశ్వరి ని నారాయణపేట డీఆర్ వో గా బదిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో ఉన్న కె.శ్రీనివాస్ ను హన్మకొండ డీఆర్వోగా బదిలీ చేశారు. మహబుబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ గా ఉన్న ఎల్.రమేష్ ను నారాయణ పేట ఆర్టీవో గా ట్రాన్స్ ఫన్ చేశారు. కుడాలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న రవీందర్ రెడ్డిని బాన్సువాడ ఆర్డీవోగా నియమించారు. టీజిఎస్ డబ్య్లూఆర్ఈఐలో పని చేస్తున్న బి.గీతను నిజామాబాద్ డీఆర్ఓగా పంపించారు. సివిల్స్ సప్లయ్స్ లో పని చేస్తున్న జి.అంబాదాస్ ను మెదక్ డీఆర్ఓగా ట్రాన్స్ ఫర్ చేశారు. డిప్యూటేషన్ పై హోచ్ఎండిలో పని చేస్తున్న ఎం.షర్మిల ను ఉట్నూరు ఆర్డీవో గా బదిలీ చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్స్ లో పని చేస్తున్న ఎం.విజయ కుమారి బోధన్ ఆర్డీవో గా నియమితులయ్యారు. దేవరకొండ ఆర్డీవో ఎస్.రమణా రెడ్డిని మిర్యాలగూడ ఆర్డీవో గా ట్రాన్స్ ఫర్ చేశారు. రెరా లో పని చేస్తున్న దొనకంటి రవీందర్ ను కాటారం ఆర్డీవోగా ట్రాన్స్ ఫర్ చేశారు. టీటీడబ్య్లూఆర్ఈఐఎస్ లో ఉన్న ఎన్.రాజేందర్ రెడ్డి ని సిరిసిల్ల ఆర్డీవో గా పంపించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో పని చేస్తున్న కె.ఎస్.బి.కుమారి ని వేముల వాడ ఆర్డీవోగా నియమించారు. హెచ్ఎండీలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న పి.పద్మ ప్రియను దేవరకొండ ఆర్డీవో గా బదిలీ చేశారు.

 

More articles

Latest article