ఏర్గట్ల, బతుకమ్మ :
గుమ్మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ దయానంద్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను, అలాగే అదే గ్రామానికి చెందిన సుధుకం దేవన్న ఇటీవల గుండెపోటుతో మరణించారన్న విషయాన్ని తెలుసుకొని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్, ఉపసర్పంచ్ కిషోర్ రెడ్డి, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, ఉప సర్పంచ్ జాకీర్ హుస్సేన్, గుమ్మిర్యాల మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడ్డం లింగారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రాకేష్, సాంసేన్, రఘుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.