29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాసులిస్తే సరి లేకపోతే కేసుల్లో ఇరికిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీస్ స్టేషన్ లలో రెచ్చిపోతున్న ఖాకీలు

 

. . . ఫిర్యాదులు ఎన్ని చేసిన చెత్త బుట్టల పాలే

 

. . . ఏసిబి దాడులతో ఖాకీల బాగోతం బట్ట బయలు

 

. . . అవినీతి ఆక్రమాలలో జైళ్లకు వెలుతున్న మారనీ ఖాకీల తీరు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 1 భాస్కర చారీ రూ.7 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక క్రిమినల్ కేసులో ఇరికించ కుండా ఉండాలంటే రూ.10 వేలు డిమాండ్ చేసి చివరకు రూ.7 వేలు ఇస్తేనే సరి లేదా క్రిమినల్ కేసులో ఇరికిస్తానని బెదిరంపులకు పాల్పడ్డారు. దానితో బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. బుధవారం నిజామాబాద్ ఏసిబి రెంజ్ డిఎస్పీ శేఖర్ అధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లోనే రూ.7 వేలు లంచం తీసుకుంటున్న భాస్కర చారీని రెడ్ హ్యండేడ్ గా పట్టుకుని అరెస్టు చేసి ఎసిబి అధికారులు రిమాండ్ కు తరలించారు. 2024 లో నవంబర్ లో వర్ని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ క్రిష్ణ  స్టేషన్ బెయిల్ కోసం ఒక వ్యక్తి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్ లలో పెట్రెగుతున్న అవినీతికి రెండు కేసులు ప్రత్యక్ష ఉదహరణలు…

జిల్లాలో పోలీస్ స్టేషన్ లను కొందరు పోలీస్ అధికారులు సివిల్ పంచాయతీలను సెటిల్మెంట్ లు చేసే అడ్డాలుగా మార్చారు. డజన్ ల సంఖ్యలో ఎస్ హెచ్ఓలు, ఎస్ఐల పై కిందిస్థాయి సిబ్బందిపై పోలీస్ ప్రజావాణిలో, జిల్లా  కలెక్టర్ కు, డిజిపిలకు ఫిర్యాదులు చేసిన అవి చెత్త బుట్టల పాలవుతున్నాయి. ప్రధానంగా శాంతి భధ్రతలు గాలికి వదిలేశారు అనే విమర్శలను ముట గట్టుకున్నారు. రేషన్ బియ్యం ( పిడిఎస్) దందా, గంజాయి, ఆన్ లైన్ బెట్టింగ్, పేకాట నిర్వహణ (క్లబ్ ల మాధిరిగా) మొరం, ఇసుక  ఆక్రమ రవాణాలు అంటే పట్టించుకునే వారు లేరు. కోందరైతే దందాలు చేసేవారితోనే ఒప్పందం కుదుర్చుకుని మాముళ్లకు తెరలేపారు అనే ఆరోపణలు లేకపోలేదు. ఇల్లీగల్ దందాలు చేస్తున్న వారి తరుపున వకాల్తా పుచ్చుకుని ఫిర్యాదు దారులపైనే అక్రమ కేసులు కోకోళ్లలు. పోలీస్ స్టేషన్ లోకి అడుగు పెడితే సామాన్యులు వణికి పోతున్నారు. ఎక్కడి కేసు ఎవ్వరి మీద నమోదు చేస్తారో అని భయపడు పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి ఆదారం లేకున్న కేవలం అప్పటికప్పుడు అభియోగాలతో కేసులలో ఇరికించేస్తున్నారు. ఎందుకంటే ఫిర్యాదు దారునితో కంటే నేరాలు చేసే వారితోనే దోస్తానా ఉండటంతో కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. దానితో జిల్లాలో చాలా మంది బాధితులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టి కమీషన్ లలో పదుల సంఖ్యలలో ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉన్నాయి. నిజామాబాద్ పోలీస్ లపై హెచ్ఆర్ సీలతో పాటు లోకాయుక్తాలలో కేసులు నమోదు అవుతుండటం అక్కడ అంటేండేన్స్ అనేది ఎదో ఒక కేసులలో ఎస్ఐలు మొదలుకోని ఎసిపీల వరకు హజరవుతుండటమే ఉధహరణగా చెప్పాలి…

నిజామాబాద్ జిల్లాలో పోలిసింగ్  వ్యవస్థ గాడి తప్పుతుందనే వాదనలు మొదలయ్యాయి.. పోలీస్ స్టేషన్ లను ఎస్ హెచ్ ఓలు, ఎస్ఐలు వసూళ్ల కేంద్రాలుగా మార్చారు అని వినికిడి. అక్కడ ఫ్రెండ్లీ పోలిసింగ్ మాటున పాత నేరస్థులను ప్రోత్సహిస్తున్నారు అనే టాక్ ఉంది. వారి ద్వారానే స్టేషన్ లలో సెటిల్మెంట్ లు చేస్తున్నారటా. అది చాలదన్నట్టు ఖద్ధర్ లీడర్ లకు ఎర్రతీవాచీ పరిచారు అనే వాధనలు లేకపోలేదు. వారు చెబితే ఎవ్వరిపైన ఆన్న కేసులు నమోదు లేకపోతే ఆక్రమంగా ఇరికించే వ్యవహరం నడుస్తుంది. బోధన్ ఎసిబి కేసు కుడా ఆక్రమంగా క్రిమినల్ కేసులో ఇరికించేది కావడం ఉధహరణగా చెప్పవచ్చు. స్టేషన్ మెట్లు ఎక్కితే ఇరు వర్గాల చేతి చమురువదులాల్సిందే అనే అపవాధు ముటా గట్టుకున్నారు. సాధారణంగా నేర విచారణలో దొరికిన ప్రాథమిక ఆధారలతో పని లేకుండా బాధ్యులకు శిక్ష పడుతుందా లేదా అనే విషయం విస్మరించి ఎప్ఐఆర్ లు ఎడాపేడా నమోదు చేస్తున్నారు. దానితో అవి కోర్టులలో నిలువడం లేదు. వాటికి ఎవిడేన్స్ లు లేవని న్యాయస్థానాలు కేసులు కోట్టేస్తున్నాయి. వంధల సంఖ్యలో ఎప్ఐఆర్ లు నమోదవుతుంటే శిక్షలు మాత్రం  పదిమందికి కుడా పడటం లేదు. ఇక కేసులలో ప్రాథమికంగా అవసరమైన సోత్తు రికవరి (గంజాయి, దొంగతనాలు) లాంటి వాటిలో నిల్ గా చూపించడంతో కేసులు ఇట్టే విగిపోతున్నాయి. డజన్ ల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే రికవరి మాత్రం చూపట్టేక కోందరికి సహయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

More articles

Latest article