భిక్కనూరు, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మ్యాదరి సంఘం పక్కన ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్ళిన గుడ్లు పంపిణీ చేసిన ఘటన కలకలం రేపింది. బండి నరేష్ కూతురికి ఇచ్చిన గుడ్లలో చాలావరకు కుళ్ళిపోయినవి ఉండడంతో వెంటనే అన్ని గుడ్లను పగలకొట్టి చూడగా కుళ్ళిపోయినవే అని తేలడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
