పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్
ఏర్గట్ల, బతుకమ్మ : గుమ్మిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ దయానంద్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను, అలాగే అదే గ్రామానికి చెందిన సుధుకం దేవన్న ఇటీవల గుండెపోటుతో మరణించారన్న విషయాన్ని తెలుసుకొని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున...