28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డిలో ఆశా కార్యకర్తల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని, నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను  పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article