పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో ఘటన
రూ.రెండు లక్షల ఆస్తి నష్టం
దిశ,పోతంగల్ : పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజ కార్యక్రమలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి రేకుల ఇంటితో పాటు దుస్తులు, బంగారు, వెండి ఆభరణ లు పూర్తిగా కాలిపోయాయి. రూ.రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు బోరునవిలపిస్తున్నారు.
