కామారెడ్డిలో ఆశా కార్యకర్తల అరెస్ట్
కామారెడ్డి, బతుకమ్మ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని, నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...