27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోంపేట గ్రామస్తుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మెండోరా: మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సోంపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మడలంలోని సోన్ పేట్ గ్రామానికి చెందిన 329 సర్వే నెంబర్ లో గల ఎకరం భూమిని గతంలో  గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామస్తులందరూ కలిసి పైసా పైసా పోగుచేసి భూమిని కొన్నట్టు తెలిపారు. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన లావణ్య ప్రభాకర్ తన పేరు మీద  2019 సంవత్సరంలో పట్టా చేయించుకున్నాడని తెలియడంతో పలుమార్లు ఆ భూమిని తిరిగి గ్రామానికి అప్పజెప్పాలని కోరారు.  అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో  అక్రమంగా భూమిని రిజిస్టార్ చేసుకున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయగా భూమిని తిరిగి గ్రామస్తులకు పట్టా చేయించి ఇస్తానని లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినా భూమిని తిరిగి ఇవ్వకుండా తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పడంతో  అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాన్ని తెలుసుకొని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందుసోమవారం బయటయించి ఆందోళన చేపట్టారు . ఇట్టి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని విషయాన్ని తెలుసుకుని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో చర్చించారు.మండల తహసిల్దార్ సంతోష్ రెడ్డికీ వినతి పత్రాన్ని అందించినప్పటికీ  సభ్యులు ఇచ్చిన దరఖాస్తును స్వీకరించి దానిపై విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పిన కమిటీ సభ్యులు వినలేదు చివరకు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మీ ఇద్దరి ఇరు వర్గాలను  పిలిపించుకొని  సమస్యను పరిష్కరిద్దామని సీఐ గ్రామస్తులకు హామీ ఇవ్వటంతో గ్రామస్తులు ఒప్పుకోని నిరసనను విరమించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Agitation of Sompet villagers in front of Tehsildar office

More articles

Latest article