తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోంపేట గ్రామస్తుల ఆందోళన

బతుకమ్మ, మెండోరా: మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సోంపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మడలంలోని సోన్ పేట్ గ్రామానికి చెందిన 329 సర్వే నెంబర్ లో గల ఎకరం భూమిని గతంలో  గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామస్తులందరూ కలిసి పైసా పైసా పోగుచేసి భూమిని కొన్నట్టు తెలిపారు. ఈ భూమిని అదే గ్రామానికి చెందిన లావణ్య ప్రభాకర్ తన పేరు మీద  2019 సంవత్సరంలో పట్టా చేయించుకున్నాడని...