27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : అర్హులందరికి రేషన్ కార్డులుల ఇవ్వాలని బోధన్ మండలంలోని అమ్దామపూర్ గామంలోని బీజేపీ నాయకులు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బోధన్ ఎమ్మార్వో విట్టల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సిర్ప సుదర్శన్ మాట్లాడారు. గ్రామంలో సుమారు మూడు వందల మందికి పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 68మందికి మాత్రమే ఇచ్చారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి రేషన్ కార్డు లు రాక ప్రజలు బాగ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేవలం బియ్యం కొరకే కాకుండా కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఆదాయం సర్టిఫికెట్ ల కొరకు, ఆరోగ్య శ్రీ కొరకు, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అవసరం అని అన్నారు. రేషన్ కార్డు లేక నిజమైన పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని, అర్హులందరికి రేషన్ కార్డు లు అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్,శక్తి కేంద్రం ఇంచార్జి నమిళ్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నమిళ్ల లింగం, ఉప్పరి శివ, బీజేపీ నాయకులు, నిరడి బాబురావు, నమిళ్ల సాయి, అరె పవన్, సిర్ప ప్రశాంత్, మల్లెపూల సాయి, గాండ్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Ration cards should be given to all eligible people

More articles

Latest article