29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ: బిచ్కుంద : తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం బిచ్కుంద మండలంలో మండల స్థాయి నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన  దీక్షకు ఎస్జీటీ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖయ్యుం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టాలని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు (మినిమం టైమ్ స్కేల్) ని వెంటనే ప్రకటించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎంటీఎంను అమలు చేసి చూపించాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ ఉద్యోగ,ఉపాధి అవకాశాల్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజ్ ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను రెగ్యులెరైజ్  చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో మారుతి సార్ ఎస్జీటీ, సర్వ శిక్ష అభియాన్ బిచ్కుంద శాఖ అధ్యక్షులు ప్రమోద్,ప్రధాన కార్యదర్శి సుధాకర్ సభ్యులు యోగేశ్వర్,పవన్ కుమార్,రుక్మిణి,రాజ్ కుమార్,గోపాల్, సాయిలు పాల్గొన్నారు.

More articles

Latest article