25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శాతవాహన హోటల్లో అడిషనల్ కమిషనర్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

  • నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందుకు జరిమానా

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న శాతవాహన ఫ్యామిలీ రెస్టారెంట్ లో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో గల కిచెన్ హాల్ ను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేశారు. అదేవిధంగా రెస్టారెంట్ లో పార్సెల్ ల కోసం వాడే ప్లాస్టిక్ కవర్లను పరిశీలించగా సింగిల్ కవర్లతో ఉండడాన్ని గమనించిన అదనపు కమిషనర్ హోటల్ యాజమాన్యానికి వెంటనే 2000 రూపాయల జరిమానాన్ని విధించారు. కాగా ఇదే రెస్టారెంట్లో ఇటీవల రాష్ట్ర ఫుడ్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టగా ఆహార నాణ్యత ప్రమాణల విషయంలో హోటల్ యాజమాన్యాన్ని మందలించగా తిరిగి ఇదే హోటల్లో నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లు వాడడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్ను ల విషయంలో వినాయక నగర్ లోనే ఉన్న త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా ప్రగతినగర్ లో ఉన్న కాకతీయ కాలేజ్ లలో సోదాలు నిర్వహించారు. ట్రెండ్ లైసెన్సులతోపాటు, ఆస్తి పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారా లేదా అనే విషయాన్నితెలుసుకున్నారు.

Additional Commissioner checks at Satavahana Hotel

More articles

Latest article