27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టెంపరరీ పర్మిట్ లకు భలే డిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

  • పటాకుల దుకాణాల పేరిట భారీగా వసూళ్లు చెపట్టిన దళారులు
  • ఆర్మూర్ లో పోలిటికల్ లీడర్లచే ఆరు లక్షల వసూళ్లు?
  • నిజామాబాద్ లో దళారుల అవతారం ఎత్తిన వ్యాపారులు
  • అధికారుల పేరు చెప్పి దీపావళి సీజన్ లో భారీగా వసూళ్లు

నిజామాబాద్, బతుకమ్మ: దీపావళి పండగకు చిచ్చుబుడ్డుల తారాజువ్వల వెలుగులు . . . లక్ష్మీబాంబుల ధమాకా, నింగిలో దూసుకుపోయే రాకెట్లు . . .తప్పనిసరి. అందుకు గాను అన్ని ప్రాంతాలలో దుకాణాలు అందుబాటులో లేవు. ఉన్నదంతా ఐదారుగురికి పటాసుల విక్రయంకు లైసెన్స్ కలిగిన హోల్ సెల్ వ్యాపారులకు రెగ్యూలర్ లైసెన్స్ లు ఉన్నాయి. మిగితా వ్యాపారం అంతా రిటైలర్ వ్యాపారుల తోనే. టపాసుల విక్రయాలకు ఖచ్చితంగా అగ్నీమాపక శాఖ, పోలిస్ శాఖ, మున్సిపాల్టీల అనుమతి తప్పనిసరి. దానికి టెంపరరీ లైసెన్స్ లు జారీ చేయడం ప్రధానంగా జరిగే తంతు. టెంపరరీ లైసెన్స్ లకు దీపావళి పండగ ముందు భలే డిమాండ్. పబ్లిక్ ప్లేస్ లలో కాకుండా క్రీడా మైదానాలలో లేదా, ఓపెన్ ప్లేస్ లలో ప్రభుత్వం పటాకుల క్రయవిక్రయాలకు అనుమతించడం అనవాయితి. దానిని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అధికారులతో అన్ని విషయాలు మాట్లాడం టెంపరరీ లైసెన్స్ లు ఇప్పించే భాధ్యత తమదని దానికి ఖర్చు అవుతుందని వసూళ్ల పర్వం చేపట్టారు. ఐదు వేలు మించకుండానే పర్మిట్ వచ్చే చోట రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూళ్లు చేయడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టోకు వ్యాపారులు కొందరిని నియమించుకుని పటాకుల విక్రయాల కోసం ఉద్ధేర బేరంను ముందు పెట్టి సెల్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. తమకు సంబందించిన వ్యక్తి ద్వారా టెంపరరీ లైసెన్స్ లు ఇప్పిస్తామని వేల రూపాయాలు వసూలు చేస్తున్నారు. అందుకు వారు వాడుకుంటున్న పేరు టెంపరరీ లైసెన్స్ ల జారీ. అందుకు సంబందించిన ముడు శాఖాల అధికారులకు ఇవ్వాలని, రిటైల్ దుకాణంకు ఇంతా ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. టెంపరరీ లైసెన్స్ ఉంటే సరుకులను ఉద్ధేరగా ఇస్తామని బేరాసారాలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇంకా టపకాయాల విక్రయాలకు జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ టెంపరరీ పేరిట వసూళ్లు ప్రారంభమయ్యాయి. టోకు వ్యాపారులు తమవద్ధకు సరుకు కొనుగోలు చేసే చిరు వ్యాపారుల వద్ధనే వసూళ్లు చేసిన మొత్తం మామూళ్లను ఇతరులకు పంపకాల కోసం వాడటం విశేషం. అందుకోసం కొందరిని ప్రత్యేకంగా నియమించుకుని దందా చేయడం రివాజుగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రిటైల్ గా జరిగే కోట్ల వ్యాపారం కోసం టెంపరరీ పర్మీట్ల జారీ పేరిట వసూళ్లు లక్షలుగా జరగుతున్నాయి. ఇక ఆర్మూర్ లో కొందరు పొలిటికల్ లీడర్లు ఆరు లక్షల వసూళ్ల వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆగ్నీమాపక శాఖాధికారులు ఖరాఖండిగా చెప్పిన తరువాత కూడా లక్కిడ్రా ద్వారా మీకే ఇప్పిస్తామని వసూళ్లను అడ్వాన్స్ గా చేయడం గమనార్హం. ఇదే పద్ధతిని మున్సిపల్ ఏరియాలలో చేయడం చేస్తున్నారని తెలిసింది. టెంపరరీ లైసెన్స్ లకు ఒక విధంగా, లైసెన్స్ లు తీసుకొని వారికి మరో రేటు ఫీక్స్ చేసి వసూళ్ల కార్యక్రమం చేపట్టడం విశేషం. టెంపరరీ లైసెన్స్ లు తీసుకొని వారిని, అసలు లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తే వారిపైకి ప్రభుత్వ శాఖాల అధికారులను పంపి బెదిరంపులకు పథకం వేసినట్లు తెలిసింది. దీపావళి పండగ సీజన్ పేరిట వసూళ్ల ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

More articles

Latest article