- కాంట్రాక్టు చేయాలని వేడుకోలు
- భరోసానిచ్చిన మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్
- లెక్చరర్ల కృతజ్ఞతలు
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమ గొంతుక మధు గౌడ్ యాష్కిని సోమవారం తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లు కలిశారు. నూడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనను పార్ట్ టైం లెక్చరర్లు కలిసి, తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. చాలీ చాలని వేతనాలతో జీవనం కష్టంగా మారిందని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ.. వర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి, సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని భరోసా కల్పించారు. ఈ మేరకు లెక్చరర్స్ సంఘ ప్రతినిధులను వచ్చే గురువారం హైదరాబాద్ రావాల్సిందిగా సూచించారు. దీంతో సంఘం నాయకులు మాజీ ఎంపీ మధు గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ మొర ఆలకించి, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి, భోజన వసతి కల్పించి, తమకు అండగా నిలిచిన మధు యాష్కీకి రుణపడి ఉంటామని లెక్చరర్స్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ ప్రసన్న, ఉపాధ్యక్షురాలు అరిగెల హరిత, కోశాధికారి గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.
