25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పసుపు బోర్డు సాధించడం పట్ల  ముగ్గుతో ధన్యవాదాలు తెలిపిన యువతి

Must read

📰 Generate e-Paper Clip

. . . ప్రదాని మోడి కి ఎక్స్ లో పోస్ట్ చేసిన ఎంపి అర్వింద్

  నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అర్వింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని  బోర్గాం(పి) కి చెందిన  చిన్నకరి భవాని  కోట గల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. పసుపు బోర్డును  నిజామాబాద్ కు మంజూరు చేయించుకోవడమే కాక, జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని  జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, స్థానిక భాజపా నాయకుడు  యాదాల నరేష్ ఇంట్లో  ధన్యవాదాలు తెలిపేలా ముగ్గు వేసింది. సంక్రాంతి పండగ సంధర్బంగా వేసిన ముగ్గులో మోడీ, అరవింద్, కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూరు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది.  కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపి అర్వింద్ యువత వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతికి ఉన్న అభిమానానికి  ధన్యవాదాలు తెలియజేశారు. సంబదిత ముగ్గు పోటోను నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ ప్రధాని మోడి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

More articles

Latest article