29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎంపీ అర్వింద్

Must read

📰 Generate e-Paper Clip

. . . బీజేవైఎం ఉపాధ్యక్షులు సంతోష్

 

నిజామాబాద్, బతుకమ్మ : 

పసుపు రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నిజామాబాద్  పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు రైతుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ ధన్యవాదాలు తెలిపారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతుల కోసం జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ప్రకటన చేయించి  రైతుల కలలను సాకారం చేయడంతో రైతులు సదా ఎంపీకి రుణపడి ఉన్నారన్నారు. గత నాలుగు దశాబ్ధాలుగా పసుపు బోర్డు కొరకు స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి ఎంపీ అరవింద్ దానిని సాకారం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక పసుపు పండించే ప్రాంతమైన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రైతులు అరవింద్ కు సర్వదా ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. నిజామాబాద్ కు చెందిన రైతు బిడ్డ జాతీయ భావాలు కలిగిన పల్లె గంగారెడ్డిని  తొలి పసుపు జాతీయ బోర్డు చైర్మన్ గా నియమించడంతో రైతుల పట్ల ఎంపీ అరవింద్ కు ఉన్న చిత్తశుద్దిని నిరూపిస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు  ఏర్పాటుతో పసుపు రైతులతో పాటు వ్యాపారులకు మేలు చేకూరుతుందని  అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా మద్దతు ధరతో పాటు కొత్త వంగడాలను రూపొందించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను ఆస్కారం  ఏర్పడిందని బీజేవైఎం నాయకులు సంతోష్ అన్నారు.

More articles

Latest article