25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కెటీఆర్ కు ఘన స్వాగతం

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కె టీఆర్) కు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం జగత్యాల జిల్లా మెట్ పల్లి నుండి పత్తి రైతులకు మద్దతు పలికెందుకు వెళ్తుండగా కమ్మర్ పల్లి వద్ద కానిస్టెన్సీ బీయర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కెటీఆర్ కు శాలువ, పూల బొకేతో సాధారంగా ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన కెటీఆర్ కు ఆర్మూర్ కానిస్టేన్సీ బీయర్ఎస్ నాయకులు పెర్కిట్ సమీపంలో స్వాగతం పలికారు. అనంతరం బాల్కొండ కానిస్టెన్సీలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాలకు చెందిన బీయర్ఎస్ నాయకులు కెటీఆర్ కు స్వాగతం పలికారు. స్వాగతమనంతరం వండలాదిగా తరలివచ్చిన స్థానిక బీయర్ఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతుల మద్దతు కార్యక్రమానికి వెళ్తున్న కెటీఆర్, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆదిలాబాద్ వెళ్లారు.

A warm welcome to KTR

More articles

Latest article