30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

లాయర్ ఫై దాడికి పాల్పడ్డ ఇద్దరు అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఖిల్లా రోడ్డులోని లాయర్ ఖాసీంపై దాడికి పాల్పడ్డ అర్షద్ ఖాన్, అతని కుమారుడు ముజాహద్ ఖాన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు 2వ టౌన్ ఎస్సై సయ్యాద్ ముజాహిద్ తెలిపారు. గత కొంతకాలం క్రితం ఖిల్లా రోడ్ లో ఖాసిం లాయర్ పైన హత్యాయత్నం చేసిన అర్షద్ ఖాన్ అతని కొడుకులు ముజాహిద్ ఖాన్, ముజాఫర్ ఖాన్ లపై 2వ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అప్పటినుండి దాడికి పాల్పడ్డ ముగ్గురు తప్పించుకు తిరుగుతున్నారు. మంగళవారం విశ్వసనీయమైన సమాచారం మేరకు అర్షద్ ఖాన్, అతని కొడుకు ముజాహిద్ ఖాన్ లను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించారు. మరొక కుమారు ముజాఫర్ ఖాన్ ఇంకా పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article