పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల మోడ్రన్ పబ్లిక్ స్కూల్ లో 1999-2000 సం. లో ఎస్ఎస్సి పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక విజయవంతమైంది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల ఓ ప్రైవేటు ఫాం హౌస్ లో ఆదివారం ఈ ఆత్మీయ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల ఎడబాటు తర్వాత ఒకే వేదికపై కలవడంతో ఆనందం వెళ్లి విరిసింది. తమకు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా స్వాగతించి ఆశీర్వచనాలు...