30.2 C
Hyderabad

పసికందు ని కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి తండ్రి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తనకు పుట్టలేదని అనుమానంతో..

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. తనకు పుట్టలేదని నెలల వయస్సు కలిగిన కోడుకును తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓకటవ టౌన్ పరిధిలోని  అశోక్ నగర్ కు చెందిన యువరాజ్, ప్రియాంక దంపతులు. ఇటీవల వారికి రెండున్నర నెలల క్రితం కోడుకు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి యువరాజ్ భార్యతో గొడవ పడేవాడు. పసికందు తనకు పుట్టలేదని అనుమానంతో వేధించేవాడు. గురువారం రాత్రి రెండున్నర నెలల పసికందును ఇంటి నుంచి బయటకు వచ్చిన తండ్రి కత్తితో పొడిచి హత్య చేసి మిర్చి కాంపౌండ్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పక్కన పారేశాడు. గురువారం రాత్రి నుంచి పసికందు కోసం వెతికిన అచూకి లేకుండా పోయింది. రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని పసికందు డేడ్ బాడీ గుర్తించగా  యువరాజ్ చేసిన ఘాతుకం బట్ట బయలు అయింది. విషయం తెలిసిన ఓకటవ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు… యువరాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది..

 

More articles

Latest article