26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో అగ్నిప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యుట్ తో అగ్ని ప్రమాధం జరిగింది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. మంటలు వేగంగా విస్థరించడంతో అగ్నికి చాలా బాగం ఆహుతైంది. అగ్నిమాపక శాఖకు ప్రమాదం గురించి సమాచారం అందించడంతో ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు గడుగు గంగాధర్ అదే నివాసంలో ఉన్నప్పటికి ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు…

. . . పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ ని, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గణేష్ బిగాల, అగ్నిప్రమాదం కారణంగా దగ్ధమైన ఇంటిని పరిశీలించి తెలుసుకున్నారు.

. . . జిల్లా కాంగ్రెస్ నాయకుల పరామర్శ

సీనియర్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్ నివాసంలో పైర్ యాక్సిడెంట్ విషయం తెలిసి ఆయనని చాలా మంది పరామార్శించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర డిసిసి అధ్యక్షుడు రామక్రిష్ణ తో పాటు సినియర్ నాయకులు జావేద్ ఆక్రం, బంటు, బలరాం తదితరులు గడుగును పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

 

Fire accident at the residence of Telangana Agriculture Commission member Gadugu Gangadhar.

More articles

Latest article