23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు బుధవారం వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 4.29లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారని తెలిపారు. పంట చేతికొచ్చి దసరాకు ముందే కోతలు మొదలు పెట్టారని అన్నారు. కేవలం మొక్కుబడిగా జిల్లాలో 150 కేంద్రాలకు కొబ్బరి కాయలు కొట్టారని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని అన్నారు. రైతులు కోసిన ధాన్యాన్ని నిల్వ చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అకాల  వర్షాల వల్ల రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పాల్గొన్నారు.

More articles

Latest article