26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడు

Must read

📰 Generate e-Paper Clip

– ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

రుద్రూర్, బతుకమ్మ  : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. నిజామాబాద్ కు చెంది షేక్ ఫౌజియా సనా, రుద్రూర్ మండలం బొప్పాపూర్ కు చెందిన ముజ్జు గత కొన్ని నెలల నుంచి ఇరు కుటుంబాలకు తెలియకుండా  ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ఇటీవ ప్రియునితో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముఖం చాటేయడమే కాకుండా ఏం చేసుకుంటావో చేసుకో పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పడంతో ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ప్రియుడి ఇంటి వద్ద ధర్నాకు దిగింది. ప్రియురాలు చెబుతున్న వివరాల ప్రకారం… తనకు ఇదివరకే పెళ్లయిందని తన భర్త దుబాయ్ కి వెళ్లి అక్కడే వేరొకరిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని ఆయనతో విడాకులు తీసుకున్నానని ఇదివరకే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఈ విషయం కూడా ముద్దుగు చెప్పానని పిల్లలను, నిన్నూ తానే చూసుకుంటానని పెళ్లి చేసుకుందామని మాయ మాటలు చెప్పడంతో శారీరకంగా కూడా కలిసామని తీరా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినతరువాత పెళ్లి చేసుకోను అని అంటున్నాడని న్యాయం జరిగింతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రియురాలు చెబుతుంది. పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

More articles

Latest article