24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించాలి
  • పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వి శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీలో లో పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ   శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఉన్నా గాని ఇంజనీరింగ్ కాలేజ్ లేదని, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు ఇంజినీరింగ్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని అన్నారు. జిల్లాకు కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తో సహా ప్రజాప్రతినిధులు  అనేక సార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు ఉన్న జిల్లాలలో ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయించుకుంటున్నారని విమర్శించారు. విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందనీ అనేక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక శిథిలవ్యవస్తలో ఉన్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వటం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫీజుల నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడం లేదని అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. విద్యారంగా సమస్యలు వెంటనే రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా కమిటీ సభ్యులు దేవిక, నిఖిల్, సాయినాథ్, హుస్సేన్, శ్రీకాంత్,తదితదిరులు పాల్గొన్నారు.

More articles

Latest article