29 C
Hyderabad

త్వరలోనే  నిజామాబాద్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి 

 నిజామాబాద్, బతుకమ్మ:

ఒకప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రమైన నిజామాబాద్ లో క్రికెట్ స్టేడియం లేదంటే తమకు ఆశ్చర్యం వేసిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి అన్నారు.నిజామాబాద్  నగర శివారులోని కేశపూర్ లో సుమారు ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం సంబంధించిన పనులు శరవేయంగా జరిగి మరో తొమ్మిది నెలల్లో పూర్తి అవుతుందని అన్నారు. నిజామాబాద్ క్రికెట్ స్టేడియం స్టేడియం బాగా చేద్దామని ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్ నకు ముఖ్య అతిథులుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యొక్క ముఖ్య లక్ష్యం రూరల్ ప్రాంతంలో క్రికెట్ ఇంప్రూవ్  చేయాలని తమ యొక్క ముఖ్య ఉద్దేశం , అదేవిధంగా పిల్లలకు క్రికెట్ తో పాటు చదువు లొ కూడా ముందుండాలన్నారు. గ్రామీణ స్థాయిలో ఆడిన క్రికెట్ ఆటగాళ్లు నేడు ఐపీఎల్ లో స్థానం కలిగి ఉన్నారన్నారు. ముందు ముందు గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని జిల్లా రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్ మంచి ప్రాధాన్యత ఉంటుందన్నారు కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బసవరాజు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి ,కోశాధికారి శ్రీనివాస్ రావు కోచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

We will soon complete the construction of the Nizamabad Cricket Stadium and make it available

More articles

Latest article