28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మంజీరా లో చిక్కుకున్న గొర్రెల కాపరులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నదిలోనే 400 గోర్రేలు

. . .  సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

బతుకమ్మ: బిచ్కుంద.

మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా నదికి వరద ఉద్రుతి పెరగడంతో పాటు నిజాం సాగర్ నుంచి నీటి విడుదల జరుగడంతో నదిలో కాపరులు, మూగజీవాలు చిక్కుకున్న ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లుర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో షెట్లూర్ , గుండె కల్లూరు గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు 400 గొర్రెలు చిక్కుకున్నట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు.

Shepherds trapped in Manjira River

గొర్రెలు కాపర్లను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారిని ఎలాగైనా కాపాడుతామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు. ఉదయం గ్రామస్థుల ద్వారా విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం సహాయక చర్యలకు ఉపక్రమించింది. ఎస్ డీఆర్ఎఫ్ టీంల సమయంలో కాపరులను, గోర్రేలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం నది పరివాహక ప్రాంతంలో మూగజీవాలకు మేత కోసం వెళ్లిన అక్కడ రాత్రి వేళ నది జలం వరద పెరగడం, నిజాం సాగర్ నీటి విడుధల చేయడంతో చిక్కుకున్నట్టు తెలిసింది. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, పశువుల కాపరులు వెళ్లవద్దని ప్రాజెక్టు అధికారులు చేసిన సూచనలు గ్రామాలకు చేరకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం.

Shepherds trapped in Manjira River

More articles

Latest article