27.5 C
Hyderabad
Friday, July 31, 2026

నకిలీల లీలలు

Must read

📰 Generate e-Paper Clip

  • నకిలీ పత్రాలతో ప్రొఫెసర్ కు కుచ్చుటోపి
  • మీ సేవా నిర్వాహకుడు, డాక్యుమెంట్ రైటర్, బుడ్డ ఎమ్మెల్యే
  • ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
  • పరారీలో ఒకరు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మీ సేవా నిర్వాహకుడు, ఓ డాక్యుమెంట్ రైటర్, మరో వ్యక్తి కలిసి యూనివర్సిటీ ప్రొఫెసర్ ను నకిలీ పత్రాలతో మోసం చేశారు. ఎకరం వ్యవసాయ పొలం అమ్మకానికి ఉందని నమ్మించి రూ.46 లక్షలు కాజేశారు. మీ సేవా నిర్వాహకుడు కీలక సూత్రదారుడిగా డాక్యుమెంట్ రైటర్ మరో సూత్రదారిగా స్థానిక గ్రామస్తుడితో కలిసి మోసం చేసిన వ్యవహరం మంగళవారం వెలుగు చూసింది. 4వ టౌన్ ఎస్ హెచ్ వో సతీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని బోర్గాం(పి)కి చెందిన చిలుక సాయిలు ఆలియాస్ బుడ్డ ఎమ్మెల్యేకు తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కనకయ్యకు మధ్య పరిచయం ఉంది. ఇటీవల కాలంలో కనకయ్య తన వద్ద ఉన్న డబ్బులతో పొలం ప్రయత్నం చేస్తుండగా విషయాన్ని గమనించి తనకు తెలిసిన వారి వద్ద పొలం అమ్మకానికి ఉందని నమ్మించాడు. అందుకు బోర్గాం గ్రామానికి చెందిన మీ సేవా నిర్వాహకుడు బండి రవి ఆలియాస్ మీ సేవా రవికి తోడుగా డాక్యుమెంట్ రైటర్ షేక్ అహ్మద్ నబి కలిసి కొత్త డాక్యుమెంట్లను తయారు చేశారు. మీ సేవా నిర్వాహకుడు బండి రవికి స్థానిక రెవెన్యూ కార్యాలయంకు చెందిన అధికారి తోడ్పాటు అందించారు. దానితో ఫ్యామిలీ సర్టిఫికెట్ ను జారీ చేయడంతో రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్దమయ్యాయి. వాటిని చూపి ప్రొఫెసర్ కనకయ్య నుంచి రూ.46 లక్షలు తీసుకుని ఎకరం పొలంను రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఎన్నిసార్లు అడిగినా పొజిషన్ చూపించకపోవడంతో అనుమానంతో ముగ్గురిని నిలదీశారు. సంబంధిత డబ్బులను వాటాలుగా వేసుకున్న ముగ్గురు రేపుమాపు అంటూ తిప్పడం ప్రారంభించారు. దానితో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం చిలుక సాయిలు, డాక్యుమెంట్ రైటర్ షేక్ హైమద్  నబిలను అరెస్టు చేశారు. మీ సేవా నిర్వాహకుడు బండి రవి పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.

  • ఎమ్మెల్యే బంధువుల భూమికి నకిలీ పత్రాలు తయారు చేసిన డాక్యుమెంట్ రైటర్ పై కేసు..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్తగా వెలుస్తున్న ఓ కాలనీలో ఎమ్మెల్యే బంధువుకు సంబంధించిన భూమికి నకిలీ పత్రాలు తయారు చేసి కాజేసేందుకు యత్నించిన కేసులో నగరంలో బోర్గాం(పి)కి చెందిన డాక్యుమెంట్ రైటర్ షేక్ హైమద్ నబి పై కేసు నమోదైంది. నిజామాబాద్ కు చెందిన మరో ఇద్దరితో కలిసి రెండేళ్ళ క్రితం నకిలీ పత్రాలతో భూమిని చదును చేస్తుండగా విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఎమ్మెల్యే బంధువు అయిన భూ యజమాని చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ తో డాక్యుమెంట్లను తయారు చేసి కొట్టేసేందుకు ప్రయత్నించగా కేసు నమోదైంది. ఈ వ్యవహరంలో జైలుకు వెళ్లి వచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇదే తరహాలో మోసం చేసిన కేసులున్నాయి.

  • మీ సేవా నిర్వాహకుడిపై వివాదాల్లెన్నో..

యూనివర్సిటీ ప్రొఫెసర్ ను నకిలీ పత్రాలతో మోసం చేసిన మీ సేవా నిర్వాహకుడు బండి రవి ఆలియాస్ మీ సేవ రవిపై చాలా వివాదాలున్నాయి. మీ సేవా కేంద్రం ముసుగులో అక్కడ ప్రభుత్వ స్థలాలను, భూ యజమానులు లేని స్థలాలను గుర్తించి డాక్యుమెంట్లను సృష్టించి అమ్మకంలో రవి సిద్దహస్తుడన్న పేరుంది. గతంలోనూ మీ సేవా కేంద్రాన్ని అధికారులు సీజ్ చేసినా ఘటనలున్నాయి.

More articles

Latest article