27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి వలలో సర్వేయర్​

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ తహశీల్దార్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్​గా పని చేస్తున్న కిరణ్​ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.  ఓ వ్యక్తి ఆస్తిపై జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆయన రూ.3లక్షల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా సర్వేయర్​ తన సహాయకుడు, కార్యాలయంలో పని చేసే చైన్​మన్​ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని ఇద్దరిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

More articles

Latest article