విజయవాడ, బతుకమ్మ : ఏపీ ఏజెన్సీలోని రంపచోడవరం అటవీప్రాంతంలో బు ధవారం మరోసారి ఎదురుకాల్పలు చోటు చేసుకున్నాయి.ఈఘటనలో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు అజాద్, దేవ్ జీ ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్ గడ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పట్టిష్ఠ నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను గమనిస్తున్నామన్నారు.
