27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్పంచ్ హత్య కేసు.. మంత్రి రాజీనామా

Must read

📰 Generate e-Paper Clip

ముంబయి, బతుకమ్మ: సర్పంచ్ హత్య కేసు  ఆరోపణల నేపథ్యంలో మహారాష్ర్ట కేబినెట్ మంత్రి ధనుంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామపంచాయతీ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ ను దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేశారు.  ఈ ఘటన మహారాష్ర్టలో తీవ్రకలకలం రేపింది. ఈ కేసులో మంత్రి ముండే సన్నిహితుడైన వాల్మిక్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రిపై సైతం ఆరోపణలు రావడం, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుండడంతో ధనుంజయ్ రాజీనామా చేశారు. అజిత్ పవార్(ఎన్సీపీ) వర్గంలో ధనుంజయ్ కీలక నేతగా కొనసాగుతున్నారు.

More articles

Latest article