27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

‘ఒక్క నిమిషం’ నిబంధన లేదు

Must read

📰 Generate e-Paper Clip

. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఎగ్జామినేషన్ హాలులోకి అనుమతి

హైదరాబాద్, బతుకమ్మ: ఇంటర్మీడియెట్ పరీక్షల సందర్భంగా ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఉండదని, పరీక్ష ప్రారంభమైన తరువాత ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ప్రకటించారు. నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామినేషన్ సెంటర్లకు చేరుకుంటే విద్యార్థులు ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయొచ్చని ఆయన సూచించారు. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించామని, దానిని స్కాన్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. సెంటర్లలోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామని తెలిపారు.

More articles

Latest article