. . . సీఎండీని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న డిచ్ పల్లి డివిజన్ విభజన వెంటనే చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు టీఎజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కోరారు. సోమవారం వరంగల్ లోని కార్పొరేట్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కంపెనీ నాయకులు మహేంధర్ రెడ్డి, శ్రీనివాస్, ఐఎన్ టీయూసీ 327 నిజామాబాద్ ప్రెసిడెంట్ పూదరి గంగాధర్ లు సీఎండీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరు అధికారుల కారణంగానే విభజన చేయడం లేదని ఫిర్యాదు చేశారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఎండీ వరుణ్ రెడ్డి మార్చి మొదటి వారంలో డిచ్ పల్లి డివిజన్ విభజన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.