నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం.కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ)( మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల ఫీ తేదీలను ప్రకటించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం, ఎమ్మెస్సీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీ రూ.500, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. ఎల్. ఎల్. బి.,ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( పి సి హెచ్ ) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.600, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. ఎంబీఏ, ఐ ఎం బి ఏ, ఎంసీఏ.అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. పీజీ – మూడవ, ఐ ఎం బి ఏ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ ( ఎం ఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ )అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500 చెల్లించాలని అన్నారు. ఐ ఎం బి ఏ.అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలన్నారు. ఈ పరీక్ష ల ఫీ అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 2025 జనవరి 06 వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.
