29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ పరీక్షల ఫీజు తేదీ ప్రకటన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం.కాం, ఎంబీఏ, ఎంసీఏ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ)( మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఐ ఎం బి ఏ) ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షల ఫీ తేదీలను ప్రకటించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ ఎంఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం, ఎమ్మెస్సీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీ రూ.500, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు.  ఎల్. ఎల్. బి.,ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( పి సి హెచ్ ) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.600, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. ఎంబీఏ, ఐ ఎం బి ఏ, ఎంసీఏ.అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800, ప్రాసెసింగ్ ఫీ రూ.200 చెల్లించాలని తెలిపారు. పీజీ – మూడవ, ఐ ఎం బి ఏ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ ( ఎం ఏ, ఎమ్మెస్ డబ్ల్యూ, ఎం కాం ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్( ఏపీ ఈ )అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500 చెల్లించాలని అన్నారు. ఐ ఎం బి ఏ.అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలన్నారు. ఈ పరీక్ష ల ఫీ అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు 100 రూపాయల  అపరాధ రుసుముతో 2025 జనవరి 06 వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ తెలిపారు.  పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.

More articles

Latest article