27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

7.700 కిలోల ఎండు గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

  • ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ 

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ ఫోర్స్ మెంట్  టీం నగరంలో ఎండుగంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విలాస్, ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేశ్ తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రంకు చెందిన ఓ మైనర్ బాలుడితో కలిసి సిరికొండకు చెందిన వంశీ,  తొర్రి తరుణ్ లు  తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతుండగా పక్కా సమాచారం మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ ఎండుగంజాయి అమ్మడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 7కిలోల 700 గ్రాముల ఎండుగంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్సై రాంకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు నారాయణరెడ్డి, రాజన్న, భూమన్న, హెడ్ కానిస్టేబుల్ భోజన్న, విష్ణు, అవినాష్, శ్యాం, సాయి, ఉత్తమ్, రాంబచ్చన్, ఆశన్న, లక్ష్మణ్, గంగారాం, మంజుల,సుకన్యలు పాల్గొన్నారు. ఎవరికైనా గంజాయి గురించి సమాచారం తెలిస్తే 8712658971కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

More articles

Latest article