- 14న కౌంటింగ్
- షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
హైద్రాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగనుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని జమ్మూ కాశ్మీర్, ఓడిస్సా, జార్కండ్, పంజాబ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మీక మరణంతో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ లను స్వీకరించనున్నారు. ఈ నెల 22న నామినేషన్ ల పరిశీలన చేయనున్నారు. ఈ నెల 24న నామినేషన్ ల ఉపసంహరణ జరుగనుంది. నవంబర్ 11న ఎన్నిక, 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ తరుపున మాగంటి గోపినాధ్ సతిమణి బరిలో దిగడం ఖాయం కాగా, కాంగ్రెస్ ఇప్పటికే నలుగురు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపింది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరుపున బరిలో నిలబడటం ఖాయంగా ఉంది.