29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీస్ కస్టడిలో యువకుడి మృతి ?

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ పోలీస్ కస్టడిలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన ఆలకుంట సంపత్ (32 ) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ ఇంటర్ నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొందరు గల్ప్ దేశాలకు వెళ్లగా అక్కడ మోసపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 4న సంపత్ ను మరో కరిని అదుపులోకి విచారించి రిమాండ్ కు పంపారు. ఇటివల సంపత్ ను విచారించేందుకు కోర్టు అనుమతి తో పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 12న అతడిని జగిత్యాల జిల్లాకు తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. గురువారం కూడా అతడిని తమ కస్టడిలో తీసుకుని విచారించగా అతడు  పోలీసులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం ఆసుపత్రికి తరలించగా రాత్రి మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు సంపత్ కుటింబికులకు రాత్రి 12 గంటల ప్రాంతంలో సమాచారం అందించగా శుక్రవారం ఉదయం జిల్లా ఆసుపత్రికి చేరుకున్న ఆందోళనకు దిగారు. సంపత్ కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు విచారణ పేరిట సంపత్ ను కొట్టిన దెబ్బలకు తాళలేక చనిపోయాడు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రస్తా రోకో నిర్వహించారు. పోలీసులు మాత్రం చేతి నోప్పితో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించగా చనిపోయాడు అని అంటున్నారు.గత ఎడాది పోక్సో కేసు నమోదైన గంటల వ్యవధిలో రెంజల్ పోలీస్ కస్టడీలో ఉన్న గిరిజనులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త పోలీస్ కమిషనర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి కస్టోడియల్ డెత్  కలకలం రేపుతోంది.

 

More articles

Latest article