నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిజిహెచ్ ను వెయ్యి పడకలకు పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ అనుబంధం) పి.సుధాకర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిజిహెచ్ ఏడవ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్లోగురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసుఫ్, జిజిహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్, జిఎంసి వైస్ ప్రిన్సిపల్ జలగం తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కలిసి పనిచేసి ఆసుపత్రికి మంచి గుర్తింపు తేవాలని కోరారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజు పెరుగుతున్న ఓపి, ఐపిలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని జిజిహెచ్ ను వెయ్యి పడకలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. వెయ్యి పడకలకు పెంచే విధంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న సూపరిండెంట్ పేద ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని సూచించారు. వీటితోపాటు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని లేనిచో ఉద్యమాలు నిర్వహించక తప్పదని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు హైమది, భాగ్యలక్ష్మి,స్వరూప, కవిత, వెంకట్, వెంకటేష్,రాధాకుమార్,రాజు, కార్మికులు పాల్గొన్నారు.

