24 C
Hyderabad
Sunday, August 2, 2026

హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను 420 హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైనా అమలు చేయక ఇంకా ఆలస్యం కావడంతో ప్రజలు ఈ ప్రభుత్వంపై రోజురోజుకు నమ్మకం కోల్పోతున్నారని బీఆర్ఎస్ మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ కి తులం బంగారం ఇవ్వక పోవడం. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ.4 వేలు,  వికలాంగులకు రూ.5 వేలు, చదువుకునే ప్రతి ఆడపిల్లలకు స్కూటీ లు ఇవ్వకపోవడం, రైతులకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం చెప్పి కోత విధించి 12వేలకు కుందిచడం చవుకున్న నిరుద్యోగులకు రూ. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాగే రైతు రుణమాఫీ ఇంకా 70 శాతం రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు. 10 వ తరగతి చదివిన ప్రతి విద్యార్థి కి రూ. 10 వేలు, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి రూ.15, 25 వేలు ఇస్తామని ఇవ్వలేదని గుర్తు చేశారు.  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ఇవ్వలేదు.వీటితో పాటు 420 హామీలను అమలు చేయాలేదు. ఆనాడు ప్రజలకు ఎన్నికల సమయంలో కళ్ల బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేదని అన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరపున కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ లు 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాపాయి పవన్, జేసీ గంగారెడ్డి, గంధం మహిపాల్, దడివే నవీన్, ద్యావతి అశోక్, భూమరెడ్డి, సీహెచ్. గంగాధర్, చిన్నారెడ్డి, పుప్పాల రాజేశ్వర్, కటికె శ్రీనివాస్,  మురళి, లింబద్రి, మహేందర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article