ది బెస్ట్ గ్రీన్ సిటీ లో ఎండిన చెట్లు

0 6,412

 

. . . చెట్లు కాపాడేందుకు నీరు పోసిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో డివైడర్ లపై హరితహరంలో భాగంగా నాటిన మొక్కలు ఎండి పోతుండటంతో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజీరెడ్డి గోవర్థన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ లు నీటిని పోసి కాపాడే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన రోడ్ల వెంట ఉన్న చెట్లకు బిందెలతో నీటిని పోసి మంగళవారం నిరసన తెలిపారు.

Withered trees in the best green cityఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో నగరం లో హరితహారం కింద డివైడర్లపై, శివారు ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల పైచిలుకు డివైడర్లు మొక్కలు నాటడం జరిగిందన్నారు. అనాడు నగరంలో నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం మేయర్ కు ఢిల్లీ నిజామాబాద్ కు బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు కూడా వచ్చిందని గుర్తు చేశారు. దానికి డ్రిప్ సిస్టం ద్వారా నీటి వ్యవస్థ కూడా కల్పించారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం జరిగిందని తెలిపారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నగరంలో పర్యావరణ పరిరక్షణకు పాటు పడేందుకు మొక్కలు నాటితే వాటిని కాపాడలేని దుస్థితిలో పాలకులు ఉన్నారని అన్నారు. వేసవి కాలం కన్నా ముందు హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడ చెవిన పెట్టీ కనీసం పట్టించుకోలేదు.దాని పర్యవసనమే చెట్లు ఎండిపోవడం జరిగిందన్నారు. కనీసం ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే పట్టించుకొని చెట్లను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బల్ధియాలో పాలకవర్గం ఉందా నగర పచ్చధనం, పరిశుభ్రతపై పట్టింపు ఎదని ప్రశ్నించారు…ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నగర బిఆర్ఎస్ అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటిసి బాజిరెడ్డి జగన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్య ప్రకాష్,సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్,మతీన్ ,జగత్ రెడ్డి, గాండ్ల లింగం, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

Withered trees in the best green city

Leave A Reply

Your email address will not be published.