23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ ఉద్యోగుల జాక్ కో- చైర్మన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల,  కార్మిక, పెన్షనర్ల  సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ  కో – చైర్మన్ నర్సయ్య అన్నారు.   గజిటేడ్ అధికారుల , ఉపాధ్యాయుల,కార్మిక, పెన్షనర్ల తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా కో – చైర్మన్ గా  జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు నర్సయ్య ఎంపికైన  సందర్భంగా శనివారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్  తో పాటు ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు చిన్నయ్య, ఉపాధ్యక్షులు బుద్ధిరాజ్, ప్రధాన కార్యదర్శి చంద్ర విఠల్, శ్రీనాథ్, రజియుద్ధిన్ అస్లాం, నారాయణ, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఉపాధ్యక్షులు జాఫర్, ప్రధాన కార్యదర్శి నారాయణ లు సన్మానం చేశారు.  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్ బాబు, రవి, ప్రకాష్, తులసీదాస్, శంకర్ లు పాల్గొన్నారు.

More articles

Latest article