- నేడు మద్యం షాపుల లైసెన్స్ ల కేటాంపునకు డ్రా
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జల్లాలో మద్యం షాపులను నిర్వహించే అద్రుష్టవంతుడు ఎవ్వరో ఈ నెల 27న తేలనుంది. ఎక్సైజ్ శాఖ ఆఅధ్వర్యంలో మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ ల జారీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 2025-27 సంవత్సరానికి గాను ఎ 4 మద్యం షాపుల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అబ్కారి శాఖాధికారులు ఉమ్మడి జల్లాలో ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు గత నెల చివర 26 నుంచి దరాఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నెల 27 వరకు నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరించగా 2786 దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులకు గాను 1502 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తుల ద్వారా అబ్కారీ శాఖకు దండిగా ఆదాయం వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తుల ద్వారా రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. కామారెడ్డి జల్లాలో 1502 దరఖాస్తుల ద్వారా రూ.45,06 కోట్ల ఆదాయం వచింది. సోమవారం లక్కీ డ్రాలను ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు తీసి లిక్కర్ సేల్ చేసే లక్కీ పర్సన్ ఎవ్వరో తేల్చనున్నారు.
- లిక్కర్ షాపుల కేటాయంపులోను కాసుల వర్షం..
మద్యం షాపులే ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరు. మందు బాబులు ఎంత తాగితే అంత ఆదాయం. కాని ప్రభుత్వం మద్యం అమ్మకందారుల నుంచి కూడా ఆదాయం రాబట్టడంతో ఖజానాకు కొత్త కిక్కు వస్తుంది. ఉమ్మడి జిల్లాలో 152 మద్యం దుకాణాలకు టెండర్ల లలో పాల్గొనుటకు ఒక్కో దరఖాస్తు ఫారం రూ.3 లక్షలకు (తిరిగి చెల్లించనక్కర్లేని) వాటి ద్వారానే రూ.128.64 కోట్ల ఆదాయం అర్జించింది. ఉమ్మడి జల్లాలో మూడు స్లాబ్ లలో మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచారు. అందులో రూ.65 లక్షలు, రూ.55 లక్షలు, రూ.50 లక్షల స్లాబ్ లుగా నిర్ణయించారు. సోమవారం 152 మద్యం దుకాణాలను లక్కీ డ్రాలో దక్కించుకున్న వారు మొదటి విడతగా ఎక్సైజ్ శాఖకు స్లాబ్ రేట్ లో 1/6 వంతు డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించిన వారికే కన్పర్మేషన్ లెటర్ లు (నౌఖరి నామా) లు అందచేస్తుంది అబ్కారీ శాఖ. లక్కీ డ్రా తీయడానికి సాయంత్రం వరకు సమయం పడుతుంది కాబట్టి డబ్బులను మొదటి విడత కిస్తిని చెల్లించుటకు మంగళవారం వరకు అవకాశం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కేవలం మొదటి కిస్తి ద్వారా రెండు రోజులలో ఎక్సైజ్ శాఖకు రూ.15 కోట్ల చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి జల్లాలో ఎక్సైజ్ శాఖతో పాటు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ లో భారతీ గార్డెన్ లో, కామారెడ్డిలో రేణుక కళ్యాణ మండపాలలో లక్కీ డ్రా నిర్వహణ జరుగుతుండటంతో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనుంది.
