పోక్సో కేసు నమోదైన వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తారు

0 8,584

 

. . . ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శ

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో రాజకీయ ప్రభావాలు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై బాలికకు సంబంధించిన పోక్సో కేసు నమోదైనా ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్య హెచ్చరికలు చేసిన తర్వాతే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోక్సో వంటి తీవ్రమైన కేసులో నిందితుడి అరెస్టులో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. కేసు విషయంలో రాజకీయ ప్రభావాలు పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.