. . . ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్
ఏర్గట్ల, బతుకమ్మ :
13 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి ఒక్క కిశోర బాలిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్నేహ సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని ఏర్గట్ల మండల ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్నేహ సంఘాల సభ్యుల సమావేశంలో కిషోర బాలికలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం కిశోర బాలికలకు రక్షణ, పౌష్టికాహారం, సాధికారత వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించే లక్ష్యంతో పాటు భవిష్యత్తు పై తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రత్యేకంగా కిశోర బాలికలతో స్నేహ స్వయం సహాయక సంఘాలను ఐకెపి ద్వారా ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా జూన్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపు సమావేశాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా “నా అవసరాలు-నా సవాళ్లు” అనే అంశంపై మాట్లాడారు. కిశోర బాలికలు పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారికి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని భవిష్యత్తుకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమాఖ్యల ప్రతినిధులు అరుణ, రాణి, సునీత, వనిత, వివోఏ లు, లలిత, నవనీత, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.